VMS Rejects Cabinet Note

కేంద్ర మంత్రిమండలి ఇటీవల తీసుకున్న మన రాష్ట్ర విభజన నిర్ణయ నేపధ్యంలో విశాలాంధ్ర మహాసభ రెండు రోజుల పాటు సుదీర్ఘ కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశ తీర్మానాలు కింద పొందు పరుస్తున్నాము.

  • విశాలాంధ్ర మహాసభ భారత దేశ కేంద్ర కాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరిస్తోంది.
  • పది కోట్ల తెలుగు ప్రజలకు భారత ప్రభుత్వం ద్రోహం చేసింది.
  • తెలుగు ప్రజలు అన్ని జాతీయ పార్టీలను, వాటితో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నిటినీ బహిష్కరించాలని విశాలాంధ్ర మహాసభ పిలుపునిస్తోంది.
  • నిన్నటి కుట్రపూరిత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం భారత దేశానికి తెలుగు ప్రజల అవసరం లేదు అనే విధంగా ఉంది.
  • ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ తమ శక్తి మేర తెలుగు ప్రజలకు ద్రోహం చేసినవే అని విశాలాంధ్ర మహాసభ భావిస్తోంది.
  • ఈ రోజు తెలుగు ప్రజల భవిష్యత్తు విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎం. పీ. ల, ఎం. ఎల్. ఏ. ల పాత్ర నిరర్ధకం, శూన్యం అయిపొయింది. వారందరినీ సాంఘికంగా బహిష్కరించి వారి ఉనికిని గుర్తించటానికి నిరాకరించాలి.
  • తమ పార్టీలను వ్యతిరేకించి నాయకులు బయటకు రావడాన్ని విశాలాంధ్ర మహాసభ స్వాగతిస్తోంది. వారిని విశాలాంధ్ర మహాసభతో కలిసి పనిచేయాల్సిందిగా ఆహ్వానిస్తోంది.
  • ఢిల్లీతో మంతనాలు, బేరసారాలు, చర్చలు, వేడుకోళ్ళు తక్షణం నిలిపివేయాలి.
  • జాతీయవాద సంస్థలని చెప్పుకొనే ఆర్. ఎస్. ఎస్., బి. జే. పీ. ల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాం.
  • తెలుగు ప్రజలు మాత్రమే చెప్పినట్లు వినే స్థానిక పార్టీలనే ఆదరించాలని కోరుతున్నాము.
  • నిన్నటి కాబినెట్ నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వం, జాతీయ పార్టీలు మన రాష్ట్ర వ్యవహారాల్లో కలగచేసుకునే హక్కును కోల్పోయ్యాయి.
  • కేంద్ర ప్రభుత్వం, జాతీయ పార్టీలు చేస్తున్న ఇలాంటి స్వప్రయోజన చర్యల వల్ల అన్ని భాషా సమూహాలకు ముప్పు పొంచివున్నదన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాలి.
  • తెలుగు ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమం చెయ్యాలి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లించటం తక్షణం నిలిపెవేయాలి.
  • జాతీయ పార్టీల ఆలోచనలు దేశంలో సమాఖ్య స్పూర్తిని పూర్తిగా తుంగలో తొక్కుతున్నాయని, దీని వల్ల దేశ సమగ్రతకు కలిగే విఘాతానికి వారే బాధ్యత వహించాలని విశాలాంధ్ర మహాసభ స్పష్టం చేస్తోంది.
  • ఉద్యమకారులందరికీ అవసరం, అవకాశం మేరకు విశాలాంధ్ర మహాసభ నైతిక మద్దతు న్యాయ సహాయం ఎల్లప్పుడూ అందిస్తుంది.
  • ప్రజలందరూ ఆందోళనలు నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా దృఢ చిత్తంతో కొనసాగించాలి.

300 Responses to “VMS Rejects Cabinet Note”

  1. GK says:

    watch this please as it is from a researcher from outside…

    https://www.youtube.com/watch?v=_vBvExh7-QY&feature=youtube_gdata_player

  2. That is very fascinating, You’re an excessively professional blogger.
    I’ve joined your rss feed and stay up for searching for
    more of your magnificent post. Also, I’ve shared your
    web site in my social networks

  3. Someone necessarily help to make seriously posts I’d state. This is the first time I frequented your website page and so far? I surprised with the analysis you made to make this particular submit incredible. Great process!

  4. I’ll immediately grab your rss as I can not find your e-mail subscription link or e-newsletter service. Do you have any? Kindly allow me recognise so that I may just subscribe. Thanks.

Leave a Reply