Archive for April, 2014
Those who have known me for a while are well aware of my cynicism for democracy and collectivism. I hold the government to be an immoral system, whose role should be shrunk as much as we can. I despise the current Democratic form of government that robs the producers, and distributes the loot to those that vote for the rulers. I did not want to vote in this election as I refused to be a party to a system that is immoral and implicitly acquiesce to a constitution that I don’t agree with. I told myself that if I ever vote, it would be only to a libertarian party that acknowledges the immorality of taxation and regulation OR at least to a libertarian aligned party that agrees to put a leash on taxation and work towards deregulation and decentralization.
Over the last few years, my friends and I waged a tireless battle to keep the state united. We have put aside our caste, religion, region, and party loyalties for this crusade. We went after every political party that has let down the cause of Telugu unity including TRS, TDP, YSRCP, Congress, and BJP.
Today a dear friend of mine requested me to vote for TDP/BJP combine. He stood by me and the organization during the most difficult times. He offered unconditional support to our efforts. He also happens to be a libertarian. He is probably one of the nicest human beings that I have come across in my life.
I told my friend that I decided not to vote for philosophical reasons and because all the political parties have let down the cause of Telugu unity. He reasoned that TDP/BJP combine is the lesser of the evil for libertarians and even for integrationists. I disagreed with him. However, I have immense respect and admiration for my friend and I could not turn his request down. I told him that I have just finished a tour campaign against the two national parties- Congress and BJP and I couldn’t possibly vote for BJP. So, the compromise we reached was to vote for TDP for the Assembly and NOTA for the parliament.
With a heavy heart, during the last hour of polling, I rushed and voted for TDP for the Jubilee Hills Assembly constituency and NOTA for the parliament constituency.
After walking out I realized I made a mistake. If I was not in such a rush to vote, and had structured my thought process a bit more, I would have voted for Jai Samaikyandhra Party for the parliament. Though I was quite unhappy with Kiran Kumar Reddy for delaying his fight against the Union Government, he fought hard during the climactic phase of the division. Since I voted for TDP for the Assembly, it was only fair to vote for his parliament candidate- but I goofed up badly. My sincere apologies to Kiran Kumar Reddy, who has been supportive to our organization.
I am duty bound to apologize to all those friends who trusted me to stay apolitical, for letting them down. Today I swore never again to vote (not even NOTA)- unless there is a libertarian party or a libertarian aligned party in the fray.
ప్రజా పిలుపు!
కాంగ్రెస్, భా.జ.పా లకు రాజకీయ పుట్టగతులు లేకుండా చెయ్యండి
- విశాలాంధ్ర మహాసభ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు జాతి ఐక్యత, రాష్ట్ర సమగ్రత పరిరక్షణల కొరకు ఎన్నో విపరీత, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించింది.
- విభజనవాదుల ప్రచారాల్ని నిరాధారాలుగా నిరూపిస్తూ పలు మీడియా సమావేశాలు, నిజానిజాలప్రదర్శనలు, కరపత్రాల-పుస్తకాల ప్రచురణలు, హైదరాబాద్ ఢిల్లీ పలు ఇతర ముఖ్య నగరాలలో నిర్వహించాం. సమైక్యతా ఉద్యమంలో మా వంతు పాత్ర పోషించాము.
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజనకు అనుకూలంగా జూలై 30, 2013న నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర వ్యాప్త సమైక్యతా యాత్ర నిర్వహించాము.
- వేలాది మంది కార్యకర్తలతో బస్సులలో నాలుగు రాష్ట్రాల మీదుగా పయనించి ఢిల్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా రెండు జాతీయ పార్టీల కార్యాలయాల ముందు భారీ నిరసనలు చేపట్టాం.
- మా నిర్విరామ ప్రయత్నాలు, ఐక్యంగా ఉండాలన్న రాష్ట్ర ప్రజల సంకల్పం నెరవేరక పోవటానికి ఏకైక కారణం రెండు ముఖ్య జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, భా.జ.పా., కుమ్మక్కు కావటం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు చేసిన ఈ కుట్ర తెలుగు ప్రజల మనస్సులను శాశ్వతంగా గాయపరిచింది. పార్లమెంట్ లో విభజన బిల్లు ఆమోదం పొందిన తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరినీ తీవ్రమయిన ఆవేదనకు, అవమానానికి గురిచేసింది. తమ జాతి విచ్చిత్తికి కారకులందరిపైనా ప్రతీకార భావనలను రగిల్చింది.
- జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భా.జ.పా.లకు తెలుగు గడ్డ మీద రాజకీయ పుట్టగతులు లేకుండా చెయ్యాలి. ఈ పార్టీలనుంచి పోటీకి నిలబడిన అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా చూసే భాద్యత తెలుగు ప్రజలందరిది.
- విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తోంది. మన రాష్ట్ర విభజనకు అవలంభించిన విధానం ఒక దుష్ట సాంప్రదాయానికి నాంది పలికింది. ఇటువంటి నియంతృత్వ అప్రజాస్వామిక తీరు ఇప్పటికయినా అరికట్టకపోతే అది దేశ విచ్చిత్తికి దారి తీస్తుంది.
- మన రాష్ట్ర విభజన జాతీయ పార్టీల కుట్రలో ఒక చెడు ఆరంభం మాత్రమే. రాజధాని, నీళ్ళు , నిధుల పంపకాల విషయాలలో తెలుగు ప్రజల మధ్యన విద్వేషాలు విభేదాలు సృష్టించి తెలుగు జాతిని మరింత బలహీన పరచటానికి జాతీయ పార్టీలు మరిన్ని కుతంత్రాలు పన్నటం తధ్యం. కాబట్టి తెలుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
- తెలుగు జాతి ప్రస్తుత దుస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టబడిన అపరిమిత అధికారం అని గ్రహించి రాష్ట్ర పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ భూమికను నియంత్రించాలి. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, విదేశీ వ్యవహారాల వంటి మౌలిక పరిపాలనా అంశాలకే పరిమితం కావాలి. కాబట్టి, తెలుగు ప్రజలు స్వయం ప్రతిపత్తికై పోరాడాలి. మన పోరాటం ఇతర భాషా జాతులకు స్ఫూర్తి కావాలి.